Guntur Kaaram Shooting Update: 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు (Mahesh babu) అలాగే త్రివిక్రమ్ (Trivikram) కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మొదలుపెట్టింది దగ్గర నుంచి ఏదో ఒక రూమర్ సినిమాపై నడుస్తూనే ఉన్నాయి. మొదటిగా డైరెక్టర్ తమన్ సినిమా నుండి తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాదు లో శరవేగంగా జరుగుతుంది.
Guntur Kaaram Shooting Update: గుంటూరు కారం సినిమాలో ప్రస్తుతం శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో శరవేకంగా జరుపుకుంటున్న గుంటూరు కారం షూటింగ్ గురించి సాలిడ్ అప్డేట్ అయితే సినిమా వర్గాల నుండి అందుతుంది. మొదట షెడ్యూల్ 10 రోజులు షూట్ చేసిన ఫైట్ సీన్ ని త్రివిక్రమ్ తీసివేసి మళ్లీ రీ షూట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మొదటిగా పది రోజులు చేసిన బస్సు ఫైట్ సీన్ ని త్రివిక్రమ్ ఆ తర్వాత వేరే ఫైట్ డైరెక్టర్ తో వేరే రకంగా చేయగా మళ్లీ దాన్ని ఇప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి కామెడీ యాంగిల్ లో కబడ్డీ యాక్షన్ సీక్వెన్స్ తలకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మరి ఒక్కటే యాక్షన్ సీన్ ని మూడుసార్లు రీ షూట్ చేయటం అంటే గురూజీ సినిమా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా తరికెక్కిస్తున్నారని అర్థమవుతుంది.

త్రివిక్రమ్ ప్రతి చిత్రంలో కూడా యాక్షన్ పార్ట్ ని కాస్త స్పెషల్ గా డిజైన్ చేస్తారు. త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు లేటెస్ట్ షెడ్యూల్ కూడా దీనికి సంబంధించిందే కావడం విశేషం. ప్రస్తుతం హైదరాబాదులో ఈ షూటింగు జరుగుతుంది. డిసెంబర్ లోపల ఈ సినిమాని ముగించి మహేష్ బాబు , రాజమౌళి SSMB29 సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో జాయిన్ అవ్వటానికి చూస్తున్నారు.
సినిమా మేకర్స్ కూడా గుంటూరు కారం సంబంధించిన బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు త్రివిక్రమ్ కావాల్సిన అన్ని సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.