HomeOTT తెలుగు మూవీస్మహేష్ బాబు విడుదల చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్

మహేష్ బాబు విడుదల చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్

Mahesh Babu launched Anasuya Bharadwaj starrer Prema Vimanam Teaser, ZEE5 OTT originals Prema Vimanam web series teaser, Prema Vimanam movie teaser, Prema Vimanam OTT Release date

ZEE5 OTT Prema Vimanam Teaser: గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూప‌ర్ స్టార్ మ‌హేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభ‌న్‌, శాన్వి మేఘ‌న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ZEE5 OTT Prema Vimanam Teaser: టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే… ఓ ప‌ల్లెటూరులోని ఇద్ద‌రు పిల్ల‌లు వారికి ద‌గ్గ‌ర‌గా ఉండే కొండ‌నెక్కి విమానాన్ని చూస్తుంటారు. అందులో ఓ పిల్లాడు మ‌రో పిల్లాడితో ‘అరే మ‌నం కూడా విమానంలో పోదాం రా’ అంటాడు. వారిద్దరూ విమానాన్ని చూడగానే సంతోషపడుతుంటారు. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది.

Mahesh Babu launched Prema Vimanam Teaser

అదొక్కటే కాదు.. విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ వారి గూడెంలోని వ్యక్తి (వెన్నెల కిషోర్)ని అడుగుతుంటారు. పిల్లల సందేహాలు తీర్చలేక అతని తల ప్రాణం తోకకొస్తుంటుంది. ‘విమానం కనిపెట్టిన రైట్స్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని’ అని అసహనం వ్యక్తం చేస్తుంటాడు.

మరో వైపు ఓ ప్రేమ జంట (సంగీత్ శోభన్, శాన్వి మేఘన) సంతోషంగా ఉంటారు. అబ్బాయి, అమ్మాయి మధ్యలో మనస్పర్దలు, వాటికి కారణం ఏంటి? వారి ప్రేమ‌ని ఊరు అంగీక‌రిస్తుందా? చివ‌ర‌కు వారు విమానం ఎక్కి ఎందుకు పారిపోవాల‌ని అనుకుంటుంటారు. వీరంద‌రూ ఒక‌చోట చేరిన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది. అస‌లు విమానానికి వీరి జీవితాల‌కు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఒక వైపు ప్రేమ‌లోని మాధుర్యం, తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే పిల్ల‌ల అమాయ‌క‌త్వం వ‌ల్ల వ‌చ్చే ఫ‌న్‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే స‌న్నివేశాలు ఇవ‌న్నీ ప్రేమ విమానంలో మిళిత‌మై ఉన్నాయ‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. బలమైన ఎమోషన్స్, చేజింగ్ సన్నివేశాల కలయికగా ఈ వెబ్ ఒరిజినల్‌ను సంతోష్ కటా తెర‌కెక్కించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

- Advertisement -

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి తర్వాత హీరో సంగీత్ శోభన్ నటిస్తోన్న భారీ చిత్రం ‘ప్రేమ విమానం’. అలాగే నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్, అనిరుధ్ తొలిసారి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన తొలి వెబ్ ఒరిజినల్ కూడా ఇదేకావటం విశేషం.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY