Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News
Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News

మహేష్ బాబు కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిపోయే సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి….ఎప్పుడెప్పుడా అని అంతా ఆతృతగా ఎదురుచూసిన మహర్షి డే రానే వచ్చేసింది.రెండు గంటల 58 నిమిషాల నిడివి ఉన్న రిషి జర్నీ లో జాయిన్ అయిపోవడానికి అంతా రెడీ అయ్యారు.అయితే ఈ సినిమాకి 25 వ సినిమా అనే నెంబర్ తో పాటు మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి.

వాటిలో మొదటిది మూడు అగ్ర బ్యానర్స్ పై రూపొందిన మహర్షి మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంది.అయితే నాన్ బాహుబలి క్యాటగిరీ లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్.దీంతో మహేష్ క్రేజ్ ఎలా ఎదిగిందో అర్ధమవుతుంది.మహర్షి సినిమా క్రేజ్ కి గవర్నమెంట్ కూడా కోపరేట్ చేసి రోజుకు అయిదు షో లు వేసుకునేలా పర్మిషన్స్ ఇచ్చారు.దీనికి తోడు బెంగళూరు లో సైతం 400 స్క్రీన్స్ మహర్షి కి కేటాయించారు.దీంతో మొదటి రోజు కలెక్షన్స్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ కూడా మహేష్ పేరుమీదకి మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అలాగే మహేష్ సినిమాలో అతని ట్రేడ్ మార్క్ రన్నింగ్ షాట్స్,ప్రేక్షకులని కట్టిపడేసే ఎమోషనల్ ఎలివేషన్స్ తో పాటు మహేష్ కి సెంటిమెంట్ అయిన మూడక్షరాల టైటిల్ గా మహర్షిని సెట్ చేసారు.

ఇవన్నీ కూడా సినిమాపై పోజిటివిటీ ని పెంచే ఫాక్టర్స్.మహేష్ బాబు సినిమాలో మూడు,నాలుగు హైలైట్స్ ఉంటేనే సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది.భరత్ అనే నేను విషయంలో జరిగింది అదే.అయితే మహర్షి లో అయితే మామూలుగానే పది హైలైట్స్ లెక్క చెబుతున్నారు.దీంతో ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఏంటి అనేది కూడా ఊహించడానికి కష్టమవుతుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూడా తన తరువున ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు.వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ కూడా పెంచుకుంటూ వస్తున్న మహేష్ ఈ సినిమాలో స్టూడెంట్ లుక్ తో సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతున్నాడు.

ఇక మహర్షి టికెట్స్ రేట్లు కూడా మిగతా సినిమాలకి భిన్నంగా ఉన్నాయి.మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు,సింగిల్ స్క్రీన్స్ లో 30 రూపాయలు పెంచారు అంటున్నారు.ఇదొక్కటి మాత్రం సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు పుష్కలంగా ఉంన్నాయి.గతంలో అరవింద సమేత కి కూడా టికెట్ రేటు పెంచడం అనేది షాక్ ఇచ్చింది.రెండువారాలపాటు టికెట్ రేటు పెంచితే పైరసి కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేకపోలేదు.మరి మహర్షి లెక్కలు ఎలా ఉంటాయో?…ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.