Mahesh Babu, Maharshi ,Non-Baahubali Record, Tollywood Movies
Mahesh Babu, Maharshi ,Non-Baahubali Record, Tollywood Movies

మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్,నాన్-ఫ్యాన్స్ అనే తేడాలేకుండా సినిమా అభిమానులు అంతా కూడా ఎదురుచుతుంటారు.గత సమ్మర్ లో భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టడం,మహర్షి మహేష్ కెరీర్ లో 25 వ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫోకస్ మరికాస్త ఎక్కువయింది.

అయితే మహర్షి పై భారీ అంచనాలు ఏర్పరిచిన ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో హల్చల్ చేస్తుంది.అందరికి యునానిమస్ గా నచ్చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మాత్రం సంచలనాలు సృష్టిస్తుంది.దీంతో నాన్ బాహుబలి రికార్డులు అన్నీ కూడా ఈ ట్రైలర్ పేరిట మారిపోయాయి.మహర్షి ట్రైలర్ ప్రీ రిలీజ్ జరుగుతున్న రోజు రిలీజ్ చెయ్యడంతో భారీ హైప్ వచ్చింది.గంటలోపే మిలియన్ వ్యూస్ అందుకుంది.ఈ వ్యూస్ తో ఆ సినిమా గురించి వెయిటింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

ఇక అక్కడినుండి రికార్డ్స్ వేట సాగించిన మహర్షి ట్రైలర్ 20 గంటల్లో 7 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటింది.గతంలో అరవింద సమేత 6.9 మిలియన్స్ వ్యూస్ సాధిస్తే మహర్షి ఇప్పుడు లక్ష వ్యూస్ తో దాన్ని క్రాస్ చేసింది. మహేష్ కి ఉన్న ఓవర్సీస్ ఫాలోయింగ్ కూడా దీనికి ఒక కారణం.ఇక స్టూడెంట్ గెటప్ లో మహేష్ క్రేజీ లుక్ అండ్ యాటిట్యూడ్ అందరికి కనెక్ట్ అయ్యింది.ఇక మహేష్ స్టైలిష్ లుక్స్ చూడడానికి రిపీట్ గా ట్రైలర్ చూస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రేండింగ్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరి ఆ ప్లేస్ ని పూర్తిగా ఆక్రమించేసింది.ఇప్పటికే 9 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి ఇంకా స్ట్రాంగ్ గా ఉంది.

దీంతో బాహుబలి:ది కంక్లూషన్ తరువాత ఎక్కువమంది చుసిన ట్రైలర్ గా నిలిచింది మహర్షి.లైక్స్ పరంగా మాత్రం అరవింద సమేత ని దాటలేకపోయింది.మొత్తానికి మహేష్ 25 వ సినిమాకి ఏదైతే హైప్ కావాలో దాన్ని సాధించడంలో మహర్షి ట్రైలర్ మాత్రం సక్సెస్ అయ్యింది.సినిమా సంచలనాలు స్టార్ట్ అయ్యే వరకు ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఈ ట్రైలర్ రికార్డ్స్ ఊపు ఇస్తున్నాయి.