మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కిన మహర్షి కథ క్లైమాక్స్ కి చేరింది.200 సెంటర్స్ లో 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా కొత్త సినిమాల రాకతో తన రన్ చాలించింది.ఒకటీ అరా చోట్ల ఇంకా ఆడుతున్న అది కేవలం ఆ థియేటర్స్ ఫీడింగ్ కోసమే.మహేష్ బాబు సొంత థియేటర్ అయిన AMB సినిమాస్ లో కూడా ఈ సినిమా రన్ ఎండ్ అయ్యింది.వీక్ ఎండ్ లో ఒక షో వేస్తున్నారు.ఫైనల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి హిట్ అనిపించుకుంది.
[INSERT_ELEMENTOR id=”3574″]
కానీ ఈ సినిమాలో కంటెంట్ రేంజ్ ఏంటి అనేదానిపై అందరికి క్లారిటీ ఉంది.మహర్షి తరువాత మినిమమ్ హిట్ అనిపించుకున్న సినిమా ఏదీ లేకపోవడంతో మహర్షి హవా మామూలుగా సాగలేదు.మూడు గంటల కంటెంట్ ని కూడా ఓపిగ్గా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు.ఫైనల్ గా ఆల్ టైం టాలీవుడ్ గ్రాసర్స్ లో టాప్ 5 ప్లేస్ ని దక్కించుకుంది మహర్షి.నైజాం లో మాత్రం నాన్ బాహుబలి స్టేటస్ దక్కించుకుంది.ఉత్తరాంధ్ర,కృష్ణా లో కూడా మహర్షి దూకుడు కి తిరుగులేదు.కానీ నెల్లూరు,సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోయారు.ఓవర్ సీస్ లో కూడా నష్టాలు తప్పలేదు.
[INSERT_ELEMENTOR id=”3574″]
కాకపోతే అవి అంత పెద్ద మొత్తం కాదు.పైగా దిల్ రాజు నిర్మిస్తున్న అరడజను సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.మహేష్ అండ్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా దిల్ రాజు హ్యాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని బిజినెస్ కూడా దిల్ రాజు చేతులమీదుగా జరుగుతుంది.ఆ టైం లో ఆ చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఫైనల్ చేస్తారు.ఓవర్ ఆల్ గా ఓకే అనిపించుకున్న మహర్షి ఫైనల్ గా మాత్రం హిట్ స్టేటస్ దక్కించుకుంది.మహేష్ కెరీర్ లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
Area | Closing Share |
Nizam | 29.90 Cr |
Ceeded | 10.10 Cr |
Guntur | 7.80 Cr |
UA | 10.90 Cr |
Krishna | 5.80 Cr |
West | 6.05 Cr |
East | 7.18 Cr |
Nellore | 2.78 Cr |
AP/TS | 80.51 Cr |
ROI | 10.70 Cr |
Overseas | 10.40 Cr |
Worldwide | 101.61 Cr |
[INSERT_ELEMENTOR id=”3574″]