Mahesh Babu starrer Sarileru Neekevvaru's shooting schedules gets wrapped up
Mahesh Babu Sarileru Neekevvaru Title Song-min

మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబో లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది.దీంతో అప్పుడే సినిమా టీమ్ ప్రమోషన్స్ మీద కూడా దృష్టిపెట్టనట్టు తెలుస్తుంది.రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వఁరు సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ట్రైలర్ ఇచ్చిన అనిల్ రావిపూడి అండ్ టీమ్ మళ్ళీ వారం తిరగకుండానే ఆగస్టు 15 కి సోల్జర్స్ మీద డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

అయితే ఈ పాట సినిమాలోకూడా టైటిల్ ట్రాక్ గా ఉంటుందా లేక కేవలం పేట్రియాటిక్ స్పిరిట్ నింపడం కోసం ఈ వీడియో ని రిలీజ్ చేసారా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మ్యాన్ గెట్ అప్ కి ఫ్యాన్స్ నుండి మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రీసెంట్ షార్ట్ లిరికల్ వీడియో లో కూడా మహేష్ కి సంబందించిన మరొక రెండు షాట్స్ యాడ్ చేసి ఇచ్చారు.సంక్రాంతి రిలీజ్ అనుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లోనే షూటింగ్ పూర్తిచేసేసుకుంటుంది.సినిమా స్క్రిప్ట్ పై డైరెక్టర్ కి ఉన్న కమాండ్,డైరెక్టర్ పై హీరో కి ఉన్న నమ్మకం వల్ల సరిలేరు నీకెవ్వరూ సూపర్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

 

Consider these articles: