Mahesh Babu Next movie after Sarileru Neekevvaru with Vamsi Paidapally
Mahesh Babu Next movie after Sarileru Neekevvaru with Vamsi Paidapally

మహర్షి.. సమాజంలో స్ఫూర్తి నింపడానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అది..! భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. ముఖ్యంగా రైతుల కోసం పోరాడడం.. ఎన్నో విషయాలను ఈ తరం ప్రజలకు చెప్పడం.. ముఖ్యంగా ఎంతో మంది రైతు కుటుంబాలను ఈ సినిమా కదిలించింది. ఈ సినిమా తర్వాత మాస్ సినిమాగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు చేస్తున్నారు. సంక్రాంతికి కానుకగా సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం వుంది.

ఇక మహేష్ అభిమానులు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే టీజర్ మాంచి హిట్ గా నిలవగా.. మొదటి సాంగ్ ‘మైండ్ బ్లాక్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. యూట్యూబ్ లో వ్యూస్ మాత్రం చాలానే వస్తున్నాయి. ఇక ఈ సోమవారం మరో పాట విడుదల కాబోతోంది. అదన్నా అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. ప్రతి సోమవారం ఒక్కో పాట చొప్పున విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మొదటి సోమవారంలో భాగంగా ‘మైండ్ బ్లాక్’ పాటను విడుదల చేశారు. రెనీనా రెడ్డి, బ్లాజీ ఈ పాటను పాడారు. పాట మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్స్ చెప్పడం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ‘మైండ్ బ్లాక్’ సాంగ్ ను కాపీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘శైలజా.. శైలజా’ సాంగ్ లాగే ఉందంటూ కామెంట్లు స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి పాత్ర సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాని విడుదల చేయనున్నారు.