Mahesh Babu Next Movie Mahesh27 locked director and Producer.
Mahesh Babu Next Movie Mahesh27 locked director and Producer.

2020 సంక్రాంతి సినిమా లవర్స్ కి చాలా స్పెషల్ గా మారింది. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 11 న విడుదల కాబోతుందని సమాచారం. అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు, ఈ సినిమా కూడా జనవరి 12 న విడుదల కాబోతుందని సమాచారం. అందుకే ఈ సినిమాల ప్రమోషన్స్ విషయంలో గట్టి పోటీ నెలకొంది.

అయితే ప్రమోషన్స్ విషయంలో మహేష్ ‘సరిలేరు‘ కంటే బన్నీ ‘అల వైకుంఠపురములో‘ చాలా ముందుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మహేష్ సినిమా ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. మహేష్ ఫాన్స్ అందరూ చాల ఈ విషం లో అప్డేట్ ఇవ్వాలి అని ట్విట్టర్ లో గొడవ చేస్తున్నారు..

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తరువాత మహేష్ 27 ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనేదాని పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ (బుజ్జి) పేరు ఎక్కువగా వినిపించింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. తరువాత కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మహేష్ ని కలవటం అలాగే మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ లో డైరెక్టర్ లాక్ చేయటం అందరూ మహేష్ తరువాత మూవీ ఆ డైరెక్టర్ అనుకున్నారు, తరువాత ఈ వార్త పై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇది కూడా రూమరే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా ఫిక్స్ అని అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. చిత్రం తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుని ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. అందుకు కొత్త లుక్ కూడా ట్రై చేయబోతున్నాడట. ఇక ఆ మూడు నెలల గ్యాప్ లో ప్రశాంత్ నీల్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉంటాడని టాక్ నడుస్తుంది. ఇది ‘పాన్ ఇండియా’ కథ అని అందరూ అనుకుంటున్నారు.. ఇక ఈ చిత్రాన్ని ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ అధినేత అనిల్ సుంకర నిర్మించబోతున్నాడని తెలుస్తుంది.

అలాగే మహేష్ సరిలేరు‘ ఫస్ట్ సింగిల్ & ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారట మేకర్స్. డిసెంబర్ 1 న మొదటి పాటను అలాగే ట్రైలర్ విడుదల చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారమ్.