mahesh babu, Mythri Movie Makers, Tollywood Movies
mahesh babu, Mythri Movie Makers, Tollywood Movies

మైత్రి మూవీ మేకర్స్…ఈ సినిమా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి,బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫౌండేషన్ గట్టిగా వేసుకోవడానికి కారణం మహేష్ శ్రీమంతుడు అనే సినిమా ఒప్పుకుని ఆ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని వాళ్లకి ఇవ్వడం.ఆ గ్రాటిట్యూడ్ తోనే మహేష్-సుకుమార్ కాంబినేషన్ సెట్ చేశారు.

అయితే సుకుమార్ తన క్రియేటివిటీ కి కమర్షియల్ బ్రేక్ ఇచ్చి నిర్మాతగా సినిమాలు సెట్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు.మహేష్ ఫ్రీ అయ్యే టైం కి కథతో ఒప్పించుకోలేక పోయాడు.అక్కడికి మహేష్ అతనికి నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇచ్చాడు.కానీ హర్ట్ అయిన సుక్కు బన్నీ తో సినిమా అనౌన్స్ చెయ్యడం,దానికి ఫీల్ అయిన మహేష్ సుక్కు కి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చెయ్యడం జరిగిపోయింది.

అయితే ఈ ఎపిసోడ్ లో తమ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్లేమ్ అయ్యింది మాత్రం మైత్రి మూవీ మేకర్స్.దాంతో మహేష్ మైత్రి లో ఇకపై సినిమాలు చెయ్యడు అనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.దీంతో అలెర్ట్ అయిన మైత్రి వాళ్ళు మహేష్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం,అసలు విషయం వివరించడం జరిగాయి.అయినా కూడా మైత్రి పై మహేష్ గుర్రుగా ఉన్నాడు అని చెప్పుకున్నారు.కానీ ఇవి గాలి వార్తలు అని ప్రూఫ్స్ తో సహా తేలిపోయింది.

మహర్షి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ రోజు సాయంత్రం మహర్షి టీమ్ చిన్న ప్రైవేట్ గెట్ టుగెథెర్ ఏర్పాటు చేసింది.అందులో, ఆ విందులో మహేష్ నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర తో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు కూడా ఇద్దరు కనిపించారు.నవీన్ అమెరికాలో ఉంటాడు కాబట్టి ఆయన రాలేదు.ఇలా మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మైత్రి ప్రొడ్యూసర్స్ కూడా భాగం అయ్యారు అంటే మహేష్ తో మనస్పర్థలు తొలగిపోయినట్టే.నెక్స్ట్ వాళ్ళతో సినిమా కూడా ఉంటుంది.కాకపోతే డైరెక్టర్ ప్లేస్ లో సుక్కు ఉంటాడా?…ఉండడా?…అనేది మాత్రం డౌట్.