మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..గాయాలు.

Mahesh Babu photoshoot with fans
Mahesh Babu photoshoot with fans

(Mahesh Babu photoshoot with fans)మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. సంక్రాంతికి రిలీజ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు నిర్మాతలు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వినూత్నంగా ప్లాన్ చేయటం మామూలే. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు తో ఆయన అభిమానులు ఫోటో షూట్ కు అవకాశం కల్పిస్తూ ఏకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సోషల్ మీడియా లో ఒక పోస్టు చేసింది.

సూపర్‌ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మనకు తెలియనిది కాదు. ఆయనకి అటు కుర్రాళ్ళలోనే కాక లేడీస్ లోనూ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది. అలాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోతో ఫోటో దిగే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. ఆన్ లైన్ లో ప్రకటనకు ఇంత స్పందన ఉండదని ఫీలయ్యారో లేక ఇంకేదైనా కారణమో కానీ.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవటమే కాదు.. పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఫోటో షూట్ కోసం విరగబడటంతో ఫ్యాన్స్ ను అదుపు చేయటం సాధ్యం కాలేదు. ముందస్తు జాగ్రత్త కోసం ఏర్పాటు చేసిన బార్ గేట్స్ విరిగి పోయాయి. దీంతో.. అక్కడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడ క్రౌడ్ కంట్రోల్ రాకపోవడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరికీ గాయాలు అయ్యాయి.

ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండటం తో చోటు చేసుకున్న తొక్కిస లాటలో ఇద్దరు అభిమానుల కాళ్లు విరిగాయి. దీంతో.. వారిని ప్రైవేటు ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అభిమానుల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసినట్టు సమచారం.