Mahesh Babu plays Major Ajay Krishna in Sarileru Neekevvaru Movie
Mahesh Babu plays Major Ajay Krishna in Sarileru Neekevvaru Movie

మహేష్ బాబు సినిమాల ఫలితం వెరైటీ గా ఉంటుంది.అయితే బ్లాక్ బస్టర్ లేదంటే అట్టర్ ఫ్లాప్…మహేష్ చేసిన పాతిక సినిమాల్లో ఇంచుమించు అన్నిటి పరిస్థితి ఇంతే.అలాగే మహేష్ బాబు కి టైటిల్స్ దగ్గరనుండి కూడా సెంటిమెంట్స్ కూడా ఎక్కువే.తన 25 వ సినిమాకి మహర్షి అనే టైటిల్ వినగానే ఓకే చెప్పి లాక్ చెయ్యడానికి కూడా కారణం అదే.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఈ పేరు సెటిమెంట్ తన లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో కూడా ఫాలో అవుతున్నాడు మహేష్.ఈ సినిమాలో మహేష్ పేరు అజయ్ కృష్ణ.అజయ్ అనేది మహేష్ కి ఎంత స్పెషల్ నేమ్ అనేది ఫ్యాన్స్ కి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఒక్కడు సినిమాలో మహేష్ పేరు అజయ్.ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అనేక రికార్డ్స్ తిరగరాసి మహేష్ కి స్టార్ హీరోగా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది.అలాగే దూకుడు సినిమాలో మహేష్ పేరు కూడా అజయ్.ఆ సినిమా సృష్టించిన సంచలనం కూడా అందరికీ తెలిసిందే.వసూళ్ల పరంగా పాత రికార్డ్స్ అన్నీ స్మాష్ చేసి కొత్త ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది.ఆ రెండు సినిమాల్లో మహేష్ పేరు అజయ్ కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ కి కావాలనే,పాజిటివ్ నెస్ కోసం అజయ్ అనే పేరుని ఫస్ట్ హాఫ్ గా సెట్ చేసారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పూర్తి పేరు అజయ్ కృష్ణ.కృష్ణ అనేది కూడా మహేష్ కి సెంటిమెంట్.కేవలం తన తండ్రి పేరు అనే కాదు పోకిరి లో మహేష్ పేరు కూడా కృష్ణ మనోహర్.పోకిరి కూడా ఇండస్ట్రీ హిట్.అందుకే ఆ పేరులోని కృష్ణ ని కూడా తీసుకుని అజయ్ కృష్ణ గా ఫైనల్ చేసారు.ఇలా పేరు విషయంలోనే బోలెడంత కేర్ తీసుకున్న అనిల్ ఇక సినిమా విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడు అనేది స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే మహేష్ కూడా ఈ సారి మరో ఇండస్ట్రీ హిట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అందుకే దానికి సింబాలిక్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లోని పాత్రలు కలిపి ఇలా సెట్ చేసారు.మేజర్ అజయ్ కృష్ణ…సౌండింగ్ కూడా అదిరిపోయింది.సో,థియేటర్స్ లో దద్దరిల్లి పోతుంది అనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.మరి పేరుకి తగ్గట్టుగా మహేష్ సరిలేరు ఎవ్వరు అనిపించుకుంటాడో,లేదో వచ్చే సంక్రాంతికి తేలుతుంది.ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో స్టార్ అయ్యింది.ఈ సినిమా లీక్డ్ స్టిల్స్ లో మహేష్ ని మిలిటరీ మ్యాన్ గా చూసి పండగ చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

[INSERT_ELEMENTOR id=”3574″]