Mahesh Babu Praise For Suriya Starrer Aakaasam Nee Haddhura Movie

లేటెస్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనుబంధంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సూర్య కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సూర్య అద్భుతమైన నటన, సుధా కొంగర టేకింగ్‌కు ప్రేక్షకులతో పాటు ప్రముఖులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా చూసిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘ఆకాశం నీ హద్దురా’ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రం. బ్రిలియంట్‌ డైరెక్షన్‌, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సూర్య టాప్‌ రేంజ్‌లో నటించాడు. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ ని సూర్య దయగల సోదరుడు అంటూ మహేష్ గురించి ప్రస్థావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సూపర్‌స్టార్ ప్రశంసలకు మురిసిపోయిన సూర్య ఆయనకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘మా సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్‌కు ధన్యవాదాలు. ‘సర్కారువారి పాట’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.