Homeసినిమా వార్తలుపుష్ప గురించి మహేష్ బాబు ప్రశంసలు..!!

పుష్ప గురించి మహేష్ బాబు ప్రశంసలు..!!

Mahesh Babu Comments on Pushpa: అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) భారీ హిట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కన్నా నార్త్ సైడ్ కలెక్షన్స్ ని బాగా రాబట్టింది సినిమా. చాలా మంది సినీ ప్రముఖులు మరియు నటీనటులు పుష్ప అలాగే బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు, ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ బాబు (Mahesh Babu) కూడా చేరారు.

రీసెంట్ గా మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్ పుష్ప చూడటం జరిగింది. అయితే ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు (Mahesh Babu) తన స్పందన వెల్లడించారు. పుష్ప (Pushpa) పాత్రలో అల్లు అర్జున్ (Allu Arjun) చాలా అద్భుతంగా నటించాడని, సుకుమార్ తన సినిమాని పల్లెటూరి వాతావరణంలోనే చూపిస్తూ నిజాయితీతో, క్లాస్ వేరుగా ఉండేలా మరోసారి రుజువు చేశాడని.. అని అన్నారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ గురుంచి నేను ఏమి చెప్పగలనని.. నువ్వు నిజంగా రాక్ స్టార్ అని కొనియాడాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు మొత్తం టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నానని, మీ గురించి నిజంగా గర్వంగా ఉంది అబ్బాయిలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

Mahesh Babu Tweets About Allu Arjun Pushpa
Mahesh Babu Tweets About Allu Arjun Pushpa

దర్శకుడు సుకుమార్ మరియు మహేష్ మధ్య పుకార్లు రావడంతో మహేష్ పుష్ప గురించి ఏమీ మాట్లాడడు అని చాలా మంది అనుకున్నారు. కానీ మహేష్, సుకుమార్ సినిమా మేకింగ్‌కు తన ప్రశంసలు తో పాటు మొత్తం టీమ్‌ను అభినందించారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles