నవల ఆధారంగా మహేష్‌, రాజమౌళి సినిమా..?

0
728
Mahesh Rajamouli movie based on wil Bur Smith novel

Mahesh Babu, Rajamouli: రాజమౌళి RRR కు మెరుగులు దిద్దే పనిలో బిజీ గా ఉన్నాడు. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా సంబంధించి ఇటీవలే రాజమౌళి ప్రకటించారు. ఇంకా షూటింగ్‌ కూడా మొదలు కానీ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు అప్పుడే నెట్టింట వైరల్‌గా మారుతోంది.

రాజమౌళి అన్ని చిత్రాలకు కథను అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కూడా కథను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత విల్‌బుర్‌ స్మిత్‌ నవల ఆధారంగా కథను అందిస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే నవలలను చదివేశారని తెలిపారు.

హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ చేయనున్నాడని, ఈ సినిమా మహేష్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లనుంది అని చెప్పిన విషయాలు ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆఫ్రికన్‌ అడవుల్లో జరగుందని సమాచారం. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.