
Mahesh Babu Remuneration Per Movie: త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు నటించిన గత రెండు చిత్రాలు భారీ విజయాలను అందుకోవడంతోపాటు అతని కెరియర్ లోనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో SSMB28 వస్తున్న మూడవ చిత్రం పై భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి మహేష్ బాబు (Mahesh Babu) తీసుకుంటున్న పారితోషకం 75 కోట్ల రూపాయలు అని ఇంతకుముందు టాక్ వచ్చింది.
Mahesh Babu Remuneration Per Movie:ఒక్క సినిమాకి 75 కోల్టే…అని అప్పట్లో బాగా పబ్లిసిటీ కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాజమౌళి తో (Rajamouli) మహేష్ బాబు చేయబోతున్న SSMB29 సినిమాకి ఏకంగా 110 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి (Rajamouli) మూవీస్ అంటేనే ఒక పట్టాన పూర్తి కావు.. ఓ మూవీ పూర్తి అవ్వాలి అంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పట్టడం కన్ఫామ్. మరి మహేష్ బాబు కచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేస్తాడు.
ఈ లెక్కలన్నీ సరిచూసుకొని మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమాకి రెమ్యునరేషన్ (Remuneration) పెంచేశారు. మహేష్ రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న SSMB29 మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో కూడుకున్న ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అయితే గత కొద్ది కాలంగా ఈ చిత్రం వేరువేరు కారణాలవల్ల డిలే అవుతూ వచ్చింది.
ఈ మూవీకి సంబంధించిన టైటిల్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. మే 31వ తేదీన కృష్ణా పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ అభిమానులు ఈ మూవీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత కొద్ది కాలంగా మహేష్ బాబు చిత్రాలలో కాస్త రొటీన్ ఎక్కువగా ఉంటుంది.. అయితే ఈ మూవీ రొటీన్ కి భిన్నంగా మరో పోకిరి లాగా ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని అందరూ ఆశిస్తున్నారు.