Homeసినిమా వార్తలుSSMB28 గ్లింప్స్ లో మార్పులు అడిగిన మహేష్..మాస్ ట్రీట్ ఇస్తారా?

SSMB28 గ్లింప్స్ లో మార్పులు అడిగిన మహేష్..మాస్ ట్రీట్ ఇస్తారా?

Mahesh babu request to changes in SSMB28 title glimpse details, SSMB28 title glimpse, SSMB28 title glimpse update, SSMB28 glimpse, Pooja Hegde, Sreeleela, Trivikram, Ssmb28 Title Glimpse Update

SSMB28 title Glimpse update: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరియు త్రివిక్రమ్ ప్రస్తుతం SSMB28 సినిమా కోసం పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు అలాగే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి కాలంలో, SSMB28 మేకర్స్ ఈ సినిమాని 2024 (జనవరి 13) సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు కొనసాగుతుంది. ఈ సినిమా షూటింగ్ పై చాలా రోమర్సు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రకటించిన తేదీకి విడుదల చేస్తాం అంటూ మేకర్స్ కామెంట్ చేయటం కూడా జరిగింది.

SSMB28 title Glimpse update: అంతేకాదు ఈ సినిమాపై మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్‌ల (Trivikram) మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. స్క్రిప్ట్‌ని కూడా చాలాసార్లు మార్చినట్లు చెప్పారు. ఈ సినిమాపై ఇలాంటి నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో మహేష్ బాబు అభిమానులు చాలా బాధపడ్డారు. అయితే మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ (Titile) గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు ఈరోజు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అయితే విడుదలకు సిద్ధం చేసిన గ్లింప్స్ వీడియో చూసిన మహేష్ బాబు (Mahesh Babu) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

త్రివిక్రమ్ కి అలాగే మేకర్స్ కి SSMB28 టైటిల్ గ్లింప్స్ వీడియోలో మార్పులు చేయాలి అంటూ సూచన కూడా చేశారంట. అయితే, గ్లింప్స్ చూసిన తర్వాత, గ్లింప్స్ వీడియోలో అవసరమైన దానికంటే ఎక్కువ కంటెంట్ ఉందని భావించిన మహేష్ కొన్ని మార్పులు చేయమని టీమ్‌ని కోరినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నందున ఇప్పుడు ఈ వీడియోలో కంటెంట్ ఎక్కువ చూపించటం మంచిది కాదు అంటూ మహేష్ భావించారంట. అతను చాలా చిన్న వీడియో విడుదల చేయమని త్రివిక్రమ్ టీంకి తెలియజేశాడు అలాగే ఇప్పుడు మేకర్స్ కొత్త వెర్షన్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారా అని సమాచారం.

Mahesh babu request to changes in SSMB28 title glimpse

12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

web title: Ssmb28 title glimpse update telugu, Mahesh babu request to changes in SSMB28 title glimpse details, SSMB28 title glimpse, SSMB28 title glimpse update, SSMB28 glimpse, Pooja Hegde, Sreeleela, Trivikram, Ssmb28 Title Glimpse Update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY