‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ పోస్టర్..షూటింగ్ షురూ..!

0
96
Mahesh Babu Resume shooting for Sarkaru Vaari Paata

Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు షూటింగ్‌కి సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఎంతో భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

దర్శకుడు పరశురామ్ హీరో మహేష్ బాబుకి సన్నివేశాన్ని వివరించే వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కొంత కాలం క్రితం చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా పరీక్షలు పూర్తి చేయగా… టీమ్ అందరికీ కూడా నెగటివ్ రావడంతో షూటింగ్ షురూ చేయడం జరిగింది.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కావడంతో సర్కారు వారి పాట యూనిట్ కొద్దిసేపటి క్రితం ఒక లేటెస్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. అందులో దర్శకడు పరశురామ్ పెట్ల హీరో మహేష్ తో ఏదో మాట్లాడుతూ ఉండగా, మహేష్ కూర్చుని ఉన్న వెనుక భాగం ఫోటోని విడుదల చేసారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించిన విధంగానే నేడు రిలీజ్ చేసిన మహేష్ వెనుక భాగం లుక్ లో ఆయన చెవికి పోగు, అలానే మెడ మీద రూపాయి ట్యాటూ ధరించి ఉండడం గమనించవచ్చు.

Mahesh Babu Resume shooting for Sarkaru Vaari Paata in Hyderabad

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.