(Mahesh babu sarileru neekevvaru 11 day collection, Mahesh Worldwide collection report)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు తొలిరోజు ఒకింత మిశ్రమ స్పందన సంపాదించినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ చరిష్మా తో పాటు సంక్రాంతి పండుగా సీజన్ కావడంతో మంచి కలెక్షన్ రాబడుతూ ముందుకు సాగుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కి యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. వీకెండ్ ముగిసినా మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు తగ్గలేదు. సరిలేరు నీకెవ్వరు 100కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన 4వ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఇక ఇటీవల వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా , మొత్తం పది రోజులకు గాను రూ.124 కోట్ల షేర్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్నటితో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.102.97 కోట్ల షేర్ లభించిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 11 డేస్ కలెక్షన్స్:
నైజాం – 33.54 కోట్లు
సీడెడ్ – 14.4 కోట్లు
గుంటూరు – 9.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 17.15 కోట్లు
తూర్పు గోదావరి – 10.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 6.71 కోట్లు
కృష్ణా – 8.09 కోట్లు
నెల్లూరు – 3.73 కోట్లు
11 రోజుల మొత్తం షేర్ – 102.97 కోట్లు