Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi
Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi

మహేష్ బాబు తో సినిమా అంటేనే పెద్ద సినిమా.100 కోట్ల బిజినెస్ గ్యారంటీ.కొనుక్కున్నవాళ్ళకి కూడా బాగా డబ్బులు మిగిలే అవకాశం ఉంది.ఆ సినిమా ప్రొడ్యూస్ చేసే నిర్మాతల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.అయితే మహేష్ బాబు 25 వ సినిమా విషయంలో అంతా రివర్స్ లో జరిగింది.సినిమా బడ్జెట్ 140 కోట్లకి చేరడం,సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్స్ అవ్వడం వల్ల చివరికి అంత పెద్ద సినిమా తీసి కూడా వాళ్లకు పేరు తప్ప డబ్బులు పెద్దగా రాలేదు అని టాక్ వినిపించింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇప్పుడు మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా అదే జరిగేలా ఉంది.ముందు ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అనుకున్నారు.కానీ అన్ని కన్ఫర్మ్ అయ్యే సరికి అది 90 కోట్లకు చేరింది.అయితే ఈ సినిమాకోసం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం మహేష్ రెమ్యునరేషన్ గా వెళుతుందట.దాంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు అండ్ అనిల్ సుంకరకి ప్రాఫిట్స్ కష్టంగానే ఉంది.అందుకే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో మీటింగ్స్ జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.మహేష్ బాబు కు దక్కే 52 కోట్ల పారితోషికంలో కొంత నిర్మాతలకు సర్దితే తప్ప ఈ ప్రాజెక్ట్ కదలడం కష్టంగానే ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]