Mahesh babu Sarileru neekevvaru Movie Teaser Talk
Mahesh babu Sarileru neekevvaru Movie Teaser Talk

సరిలేరు నీకెవ్వరు…ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి అనే మాట మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మహేష్ ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ మీద ఉన్నాడు,అనిల్ రావిపూడి ఖాతాలో కూడా F2 రూపంలో భారీ హిట్ పడింది.ఇక దిల్ రాజు సంక్రాంతి సెంటిమెంట్ గురించి అందరికి తెలిసిందే.అందుకే ఈ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు ఉండడం తప్పు కాదు.

కానీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీమ్ ఇచ్చిన టీజర్ లో మహేష్ లుక్ అదిరిపోయినా కూడా మహేష్ వేసుకున్న మిలిటరీ యూనిఫార్మ్ పై మాత్రం సెటైర్స్ పడుతున్నాయి.సరిలేరు నీకెవ్వరు టీమ్ తో మహేష్ అభిమానులు కూడా సినిమాని సినిమాగా చూడమని సలహా ఇస్తున్నారు.అయితే ఫస్ట్ లుక్ టీజర్ కే ఈ రేంజ్ లో నెగెటివిటీ వస్తే ట్రైలర్ తో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అనేది కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం.అయితే ఈ సినిమాలో మహేష్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ అని,సినిమాలో అసలు కథ వేరు అని అంటున్నారు.ఈ సినిమాలో రీసెంట్ గా కంప్లీట్ అయిన 35 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని టాక్.మొత్తానికి సరిలేరు నీకెవరు ట్రైలర్ యూనిట్ కి కాస్త జాగ్రతగా ఉండాలి అనే హింట్ అయితే ఇచ్చింది.