Mahesh Babu Sarileru Neekevvaru Pre Release Event Date locked
Mahesh Babu Sarileru Neekevvaru Pre Release Event Date locked

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.. ప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు.

రీసెంట్ గా టీజర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ మహేష్ లోని యాక్షన్ అండ్ కామెడీ ఎలిమెంట్ ని హైలెట్ గా చూపించారు. ఇక సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మొదట జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే డేట్ కు అల్లు అర్జున్, త్రివిక్రమ్‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కూడా చెప్పుకొచ్చారు. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారని, మహేష్ బాబు చిత్రం జనవరి 11 న థియేటర్లలోకి రాబోతుండగా, ‘అలా వైకుంతపురంలో’ జనవరి 12 వ రిలీజ్ చేయాలి అని ఫిక్స్ చేసారు .

ఇక మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న నిర్వహించడానికి నిర్మాతలు డిసైడ్ అయినట్టు సమాచారం, ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న మహేష్ రెగ్యులర్ ప్రమోషన్ ని మాత్రం డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నాడట. మరోవైపు అల్లు అర్జున్ పాటలతో రచ్చ మొదలెట్టాడు. అల.. వైకుంఠపురములో స్ట్రాంగ్ పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కూడా భారిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాయి.