(mahesh babu sarileru neekevvaru Release with new version )సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో విజయవంతంగా నడుస్తోంది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా. కలెక్షన్లు కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే సినిమాకు భారీ వసూళ్లు రావడంతో సినిమా విషయంలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటికే దేశంలో, ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రాబోతున్నది. ఈ బ్రేక్ ఈవెన్ కోసం మహేష్ బాబు ఎదురు చూస్తున్నారు. ఈ వీకెంట్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా విషయంలో ఆడియన్స్ నుంచి వస్తున్న ఒకేఒక మాట సినిమా నిడివి.
సినిమా నిడివి ఎక్కువగా ఉండడం.. పలు కామెడీ సీన్లు పండకపోవడంతో ప్రేక్షకుల టాక్ ప్రకారం కొన్ని సీన్లకు కత్తెర వేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్టు సమాచారం. సరిలేరు సినిమా రిలీజ్ కు ముందే ‘ట్రైన్ ఎపిసోడ్’ అంటూ దర్శకుడు, సినిమా యూనిట్ ఊదరగొట్టింది. బ్లేడ్ బాబ్జీగా బండ్ల అదరగొడతారని ప్రచారం చేశారు. అయితే అది అనుకున్నంత వర్కవుట్ కాలేదు. ఇక సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ పాత్రలూ అనవసరం అని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని అనవసరమైన సీన్లకు చిత్ర యూనిట్ కత్తెరవేసిందట.. ఈ శనివారం నుంచి బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ సీక్వెన్స్ సీన్లను ఎడిట్ చేశారని.. సినిమా నిడివి తగ్గించారని.. ఈ శనివారం నుంచి ఎడిటెడ్ వెర్షన్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. సమయం తగ్గిపోతుంది కాబట్టి ఇది సినిమాకు మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉన్నది. మరో ఈరోజు రేపు వీకెండ్ ఉన్నది కాబట్టి వసూళ్లు ఈ రెండు రోజులు కూడా బాగానే ఉంటాయి.
నైజాంలో మహర్షి షేర్ ను బ్రేక్ చేసే దిశగా పరుగులు తీస్తున్నది. కొన్ని చోట్ల ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ ను సొంతం చేసుకున్నది. మహర్షి కలెక్షన్లను బీట్ చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించేందుకు సరిలేరు నీకెవ్వరు సినిమా దూసుకుపోతున్నది.