Mahesh Babu sarileru neekevvaru teaser will give clarity on release date
Mahesh Babu sarileru neekevvaru teaser will give clarity on release date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.. ప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు.తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ విడుదల తేదిని ఈనెల 22న సాయంత్రి 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే ఈ చిత్రాన్ని మొదట జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే డేట్ కు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కూడా చెప్పుకొచ్చారు. ఒకే రోజున విడుదల చేయడం వల్ల రెండు చిత్రాల కలెక్షన్లు చాల వరకు కష్టం. మరియు గత నెల లేదా అంతకుముందు దీనిపై చాలా చర్చలు జరిగాయి. ఈ విషయమై ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు.. ‘అల వైకుంఠపురములో’ టీంతో మీటింగ్ పెట్టి ఓ అండర్స్టాండింగ్ కు వచ్చినట్టు కూడా ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది.

కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారని, మహేష్ బాబు చిత్రం జనవరి 11 న థియేటర్లలోకి రాబోతుండగా, ‘అలా వైకుంతపురంలో’ జనవరి 12 వ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. కాబట్టి ఆ టీజర్ ద్వారా జనవరి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తారా అనేది చూడాలి. టీజర్ కోసం మహేష్ బాబు ఫాన్స్.. ఫాలోయర్స్ చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.