Mahesh Babu Sarileru Neekevvaru wraps its entire shooting
Mahesh Babu Sarileru Neekevvaru wraps its entire shooting

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ నేటితో ముగిసింది…

ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవ్వగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా సాగుతున్నాయి. ‘జూలై 5న షూటింగ్‌ ప్రారంభించాం.. డిసెంబర్‌ 18న ముగించాం. ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు, అభిమానులకు జ్ఞాపకంగా మిగిలిపోతుంద’ని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.

మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.