గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. సక్సెస్ ఫుల్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే చిత్ర బృందం దుబాయ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చింది. మరో షెడ్యూల్ కోసం మహేష్ టీమ్ మరోసారి దుబాయ్ వెళుతున్నట్టు తెలిసింది. ఆ తరువాత గోవాలోనూ ఓ భారీ షెడ్యూల్ చేయనున్నారట. ఈ చిత్రానికి సంగీతం తమన్ చేస్తున్నారు. ఈ మధ్య థమన్ సోషల్ మీడియా లో మూవీ లీక్ చేయటంలో ముందు ఉంటున్నాడు . ఆలాగే ఇపుడు మహేష్ బాబు సర్కారు వారి పట్టా అప్డేట్ ఇచ్చాడు..
తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేసి పలు విషయాలపై స్పందించారు. మహేష్ బాబు- కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఎన్నో సర్ప్రైజ్లు రాబోతున్నాయని తమన్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు నెలలో ఈ సినిమా సాంగ్స్‌తో మనం కలుసుకుందామని చెబుతూ మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.