వచ్చే సంక్రాంతికి సిద్దమవుతున్న “సర్కారు వారి పాట”

0
383
mahesh-babu--sarkaru-vaari-paata-releasing-on-sankranthi-2022
mahesh-babu--sarkaru-vaari-paata-releasing-on-sankranthi-2022

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో మహేష్ తన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ జైత్ర యాత్ర కొనసాగించాలని ఫిక్స్ అయ్యారు.

 

 

మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్స్ తోనే భారీ హైప్ ను తెచ్చుకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలపై క్లారిటీ ఇస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక డేట్ ను లాక్ చేసేసారు. సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న ఈ సర్కారు వారి పాట చిత్రాన్ని మళ్ళీ సంక్రాంతికి టార్గెట్ చేస్తూ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా మరో మాస్ ప్రీ లుక్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసేసారు.

 

 

“సర్కారు వారి పాట” చిత్రం కు ఒక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మొట్టమొదటి సారిగా కీర్తి సురేష్, మహేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా మహేష్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.