ఈ నెల 22 నుంచి ‘సర్కారు వారి పాట’ సినిమా రెండవ షెడ్యూల్

234
Mahesh Babu Sarkaru Vaari Paata Second Schedule Starts From March 22 here in Dubai
Mahesh Babu Sarkaru Vaari Paata Second Schedule Starts From March 22 here in Dubai

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌కు రెడీ అవుతోంది.

 

 

మొదటి షెడ్యూల్‌లో చిత్ర షూటింగ్ దుబాయ్ లో చేశారు. అక్కడి ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. దుబాయ్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. ఇక కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ మళ్ళీ దుబాయ్ కు షిఫ్ట్ చేశారు.

 

 

విసాలు కొందరికి మళ్లి దుబాయ్‌కి రెండవ షెడ్యూల్ షిప్ట్ అయ్యిందని సమాచారం. ఈ రెండవ షెడ్యూల్ ఈ నెల 22 న మొదలు అవ్వుతోంది. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 15వరకు అక్కడే జరుగుతుంది. దీంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేస్తోంది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు హీరోయిన్‌గా చేస్తోన్న కీర్తీ సురేష్ కూడా పాల్గోంటుంది. కీర్తితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది.

 

 

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

 

 

ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్స్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని . నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్నఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది.