‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్లాన్ మార్చిన డైరెక్టర్..?

0
1785
Mahesh Babu Sarkaru Vaari Paata will start their first schedule in Hyderabad from January

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటించనుంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించనున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మహేష్ దీనికి ముందు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో దీనిపై ఆ అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి.మే నెలలో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ని లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు తీసుకెళ్లలేక పోయారు.

ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ముందుగా యూఎస్ లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మేకర్స్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. ముందు యూఎస్ లో అనుకున్న షూట్ ను అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ షూట్ ను అందాకా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. బ్యాంక్ స్కామ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేస్తున్నారట. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టి నిర్విరామంగా నెల రోజుల పాటు షూట్ చేయనున్నారట.

ఆ తర్వాత మార్చ్ నెలలో యూఎస్ షెడ్యూల్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ మరియు క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ తో ఈ విషయం అర్థమైంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుంనాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here