Mahesh Babu save another children’s life: మహేష్ బాబు ప్రస్తుతం తన రాబోయే సినిమా SSMB28 షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేపిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే 2000 వేల మందికి పైగా గుండాపరేషన్ చేపిచ్చి వాళ్లని కంటికి రెప్పలాగా మహేష్ ఫౌండేషన్ కాపాడింది. ఇప్పుడు అలాంటి సంఘటనే మళ్లీ మహేష్ ఫౌండేషన్ చేసింది. మరో ఏడేళ్ల చిన్నారి ప్రాణాన్ని హార్ట్ ఆపరేషన్ చేపించి మహేష్ బాబు కాపాడటం జరిగింది.
వివరాలు చూస్తే, క్రాంతి కుమార్ అనే ఏడేళ్ల చిన్నారికి 10 వేల మంది నవజాత శిశువుల్లో. ముగ్గురికి వచ్చే హాట్ డిసీస్ తనకి రావటం జరిగింది. ఇది మొదటి స్టేజిలో ఉండగానే ట్రీట్మెంట్ చేపిస్తే ప్రమాదం లేకుండా ఉంటుంది. అయితే ఈ వార్త అటూ ఇటూ తిరిగి మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే క్రాంతి కుమార్ కి ఆపరేషన్ చేపించటం జరిగింది.
ప్రసుత్తం క్రాంతి ఆరోగ్యం నిలకగడానే ఉంది. ఇది తెలుసుకున్న మహేష్ అభిమానులు మరోసారి తమ హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.