రికార్డు పారితోషికం తీసుకోనున్న మహేష్ బాబు..?

0
12
Mahesh babu shocking remuneration for trivikram movie
Mahesh babu shocking remuneration for trivikram movie

మన స్టార్ హీరోల పారితోషికాలు చుక్కల్లో ఉన్నాయన్నది వాస్తవం. అందులోనూ మహేష్ మహా పర్టిక్యులర్. మార్కెట్ కి తగ్గట్లు పారితోషికాన్ని వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు టాలీవుడ్ ప్రిన్స్. అడ్వాన్స్ తీసుకుని తన సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటాను పంచుకోవడం గత కొంత కాలంగా చేస్తూ వస్తున్నాడు మహేశ్. అలా ఎలా చూసినా 50 కోట్లకు పైగానే గిట్టుబాటు అవుతూ వచ్చింది మహేష్‌ బాబుకి. నిజానికి మహేశ్ ఫైనాన్సియల్ డీలింగ్స్ అన్నీ బోంబేకి చెందిన ఓ ఏజెన్సీ చూస్తూ వస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ వంటి డీల్స్ కూడా వారే చూస్తుండేవారు. కానీ కరోనా వేవ్ తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు ఏజెన్సీతో డీల్ కష్టతరంగా మారిందట.

 

అందుకే డైరెక్ట్ గా పూర్తి స్థాయి పారితోషికం తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నాడట. అలా తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రైట్స్, వాటాలు వంటివి లేకుండా ఇంత పారితోషికం అనే ఒప్పందం జరిగిందట. దాని ప్రకారం చూసుకున్నా గతంలో కంటే ఎక్కువే గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం. అలా ఈ తాజా సినిమాకు మహేష్ బాబు కు దాదాపు 60 కోట్లు అందనుందట.

 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమాను పూజతో ప్రారంభిస్తారట.