Mahesh babu, Rashmika Manadannah, ANil Ravipudi, Sarileru Neekevvaru
Mahesh babu, Rashmika Manadannah, ANil Ravipudi, Sarileru Neekevvaru

మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుండగానే కొత్త సినిమా మొదలు పెట్టేస్తున్నాడు.అయితే ఇకనుండి చేస్తున్న ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ఉండేలా చూసుకోవాలి అన్ని సెల్ఫ్ డెసిషన్ మాత్రం తీసుకున్నాడు.అందుకే మహర్షి లో మూడు షేడ్స్ కి సంబందించిన డిజైనింగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి,అన్నీ స్వయంగా ఫైనల్ చేసాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అందుకే సినిమాలో ఆ లుక్స్ తాలూకు ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా కనిపించింది.కాలేజ్ గెట్ అప్ మాత్రం అన్నిటిని డామినేట్ చేసింది.ప్రతి సినిమాలో క్లాస్ పీకుతున్నాడు అనే టాక్ రావడంతో కమర్షియాలిటీ ని పీక్స్ లో పండించే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఓకే చేసాడు.ఆ సినిమాకి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ పెట్టారు.ఆ టైటిల్ కి తగ్గట్టే మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అనే కసితో ఈ సినిమాకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట మహేష్.

[INSERT_ELEMENTOR id=”3574″]

మహేష్ కి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇటలీ నుండి స్పెషలిస్టులు వచ్చారు.అక్కడి ఫైట్ మాస్టర్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే మహేష్ 26 వ సినిమాలో ఫైట్స్ అదిరిపోతాయి అని వేరే చెప్పక్కర్లేదు.జులై 5 నుండి కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు.ఆ షెడ్యూల్ లో ఒక స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్ ని తియ్యబోతున్నారు.మహర్షి లో కూడా ఫస్ట్ షెడ్యూల్ నార్త్ ఇండియా లోనే షూట్ చేసారు.ఆ సెంటిమెంట్ కూడా కలసివచ్చేలా ఇలా ప్లాన్ చేసారు.అభిమానుల,ప్రేక్షకుల కోరిక మేరకు మెసేజ్ తో కాకుండా కమర్షియాలిటీ ఉన్న సబ్జెక్ట్ తో రావడానికి రెడీ అయ్యాడు మహేష్.డైరెక్టర్,హీరో,ప్రొడ్యూసర్,హీరోయిన్…ఇలా అంతా ఫుల్ ఫామ్ లో ఉన్నారు.సో,సినిమా పేరుకి తగ్గట్టుగా సాలిడ్ హిట్ కి ఫిక్స్ అయిపోవచ్చు ఫ్యాన్స్.

[INSERT_ELEMENTOR id=”3574″]