SSMB 28 Nizam Rights sold: మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబోలో వస్తున్న సినిమా SSMB28. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సమాచారం ప్రకారం మహేష్ బాబు SSMB 28 నైజాం రైట్స్ ని భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
SSMB 28 Nizam Rights sold: త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే మహేష్ బాబు SSMB 28 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. సమాచారం మేరకు SSMB28 నిజాం రైట్స్ ని సుమారు రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. బడ నిర్మాత అయిన దిల్ రాజు SSMB 28 థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
SSMB 28 నైజం రైమ్స్ తో పాటు సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకొంది. ఈ సినిమా డిజిటల్‌రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
మహేష్ బాబు SSMB28 షూటింగ్ రెండు వారాలు క్రితం హైదరాబాదులో మొదలుపెట్టారు. తొలి షెడ్యూల్ ఫిబ్రవరి 2వ తేదీన ముగుస్తుందని సమాచారం. అనంతరం రెండో షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగుతుందని తెలుస్తుంది. SSMB 28 సినిమాలో శ్రీలీల అలాగే పూజ హెగ్డే హీరోయిన్స్ గా చేస్తున్నారు.