Mahesh Babu SSMB28 title poster: క్లాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ గా ఇప్పటివరకు కంప్లీట్ మాస్ బ్యాక్ డ్రాప్ మూవీ అయితే ట్రై చేయలేదు. కాస్త మాస్టర్ వచ్చి ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పటికీ.. రాబోతున్న అతని మూవీలో ఇప్పటివరకు ఎప్పుడూ ఎరుగని విధంగా మహేష్ బాబు మాస్ క్యారెక్టర్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో మొదటిసారి పక్కా మాస్ యాంగిల్ లో మహేష్ బాబు 28 మూవీ రాబోతోంది.
Mahesh Babu SSMB28 title poster: పల్నాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అప్పట్లో బ్లాక్ బస్టర్ హీట్ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ రోజే మహేష్ బాబు తన ఫాన్స్ కి డబుల్ బోనాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మహేష్ బాబు 28 (Mahesh Babu) మూవీ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉంది కానీ ఇప్పటివరకు మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం జరగలేదు. తన తండ్రి జయంతిని పురస్కరించుకొని మే 30 మహేష్ బాబు కొత్త సినిమా యొక్క టైటిల్ (title) మరియు పోస్టర్ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి ఇంకా రెండు రోజులు టైం ఉంది అనగా తాజాగా రిలీజ్ అయిన అప్డేట్ పోస్టర్ నెట్ లో వైరల్ అయింది.

మాస్ స్ట్రైక్ కి రెండు రోజులు మాత్రమే…అంటూ ఎస్ఎస్ఎంబి 28 టీం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తోంది. చెక్స్ షర్ట్ వేసుకుని తలకి ఎర్ర కండువా కట్టుకొని.. ఒక మోకాళ్ళ మీద కూర్చొని భూమికి దండం పెడుతూ…అప్పుడే ఏదో గొడవకు సిద్ధపడుతున్నట్టు ఉన్న మహేష్ బాబు స్టిల్ పక్కన మాస్ స్ట్రైక్ కి రెండు రోజులు అన్న ఫోటో సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే వైరల్ అయింది. ఇంట్రడక్షన్ స్టిల్ ఇలా ఉంది అంటే సినిమా ఎలా ఉంటుంది అన్న ఊహాగానాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Web Title: Mahesh Babu SSMB28 title new poster , SSMB28 title, SSMB28 title announcement poster, SSMB28 title glimpse, Trivikram, Sreeleela, Pooja Hedge, Mahesh Babu