Mahesh Babu సర్కారు వారి” షూట్ ప్లాన్స్..!

0
30
Mahesh Babu target fixed for Sarkaru Vaari Paata movie

Sarkaru Vaari Paata Shoot: మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. దుబాయ్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల 15న హైదరాబాద్‌లో ఆరంభం కానుందని సమాచారం.

అయితే ఈ నెక్స్ట్ షూట్స్ హైదరాబాద్ అలాగే గోవా ప్రాంతాల్లో షూటింగ్ ఉండగా ఆ తర్వాత అమెరికాలో కూడా ఒక షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మహేశ్‌బాబు సెప్టెంబరు నెలకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారట. ఈ సినిమాల తర్వాత మహేశ్ తన తదుపరి ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవాలని అనుకుంటున్నారట.

‘సర్కారువారి పాట’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు షెడ్యూలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, అనిల్‌ రావిపూడి, రాజమౌళి దర్శకత్వాల్లో హీరోగా సినిమాలు కమిటయ్యారు మహేశ్‌బాబు.