Mahesh Babu Join Sarkaru vaari Paata shooting

Sarkaaru Vaari Paata: Mahesh Babu: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుటుంబం ఇప్పుడు విహారయాత్రకు బయలుదేరింది. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్ – సితార విదేశీ యాత్రకు పయనమయ్యారు. కొవిడ్ టైమ్‌లో ముఖాలకు మాస్క్‌లు వేసుకోవడంతో పాటు అన్ని జాగ్రత్తలతో వారు విదేశాలకు వెళ్తున్నారు.

అయితే, మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ తన బృందంతో కలిసి అమెరికా వెళ్లి లొకేషన్స్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇది బ్యాంక్ రోబరీ చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు. చాలా వరకు అమెరికాలోనే షూటింగ్ ఉంటుందట. డిసెంబర్ లేదంటే జనవరిలో అమెరికాలో షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు విదేశాలకు పయనమవడం హాట్ టాపిక్‌గా మారింది. ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో పాల్గొనడానికే ఆయన అమెరికా వెళ్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు పెట్టిన పోస్ట్. ‘‘మళ్లీ పాత రోజుల్లోకి కొత్తగా అడుగుపెట్టడానికి మాకు మేము సిద్ధమయ్యాం. విమానంలో సురక్షితంగా ప్రయాణం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. జీవితం మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది. ఇక ముందు వెళ్లడమే’’ అని మహేష్ పేర్కొన్నారు.

https://www.instagram.com/p/CHUk5xpH0mB/?utm_source=ig_web_copy_link

Sarkaaru Vaari Paata_ Mahesh Babu Go On A Vacation With Family