mahesh babu to unveil ranguladdhukunna song from uppena

Uppena Movie songs: పంజా వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానాకు డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమానుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలైయ్యాయి. నీకన్ను నీలి సముద్రం అనే పాట ఎక్కడ చూసిన మారుమ్రోగుతుంది. ఈ పాట ప్రేమికులను, కుర్రాళ్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమానుంచి మూడవ పాట రానుంది. ఈ చిత్రంలోని ‘రంగుల‌ద్దుకున్న’ పాట‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు న‌వంబ‌ర్ 11వ తేదీ సాయంత్రం 4:05 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు త‌మ‌ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రక‌టించారు.

‘ఉప్పెన’ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ‌ప్రసాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ పాట 140 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేయ‌గా, ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ సాంగ్ 25 మిలియ‌న్ వ్యూస్ దాటింది. ఇప్పుడు మూడో సాంగ్ ‘రంగుల‌ద్దుకున్న’తో దేవి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిఅయింది కానీ కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. దాంతో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. పస్ట్ ఫ్రేమ్ క్రీయోషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది..

mahesh babu to unveil ranguladdhukunna song from uppena-min