మరోసారి ‘సరిలేరు నీకెవ్వరు’ కాంబో

278
mahesh-babu-to-work-with-anil-ravipudi-again
mahesh-babu-to-work-with-anil-ravipudi-again

త సంక్రాంతికి విడుదలైన మహేశ్, అనిల్ రావిపూడి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

 

 

అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ షూట్ లో ఉన్నాడు. ఇప్పటికే మహేశ్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాతే వీరి కాంబినేషన్ మూవీ ఉంటుంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ లో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని మహేశ్ సినిమా స్ర్కిప్ట్ పై దృష్టి కేంద్రీకరిస్తాడు రాజమౌళి. సో ఇది జరగటానికి వచ్చే ఏడాది అవుతుందన్నది నిజం.

 

దీంతో రాజమౌళి సినిమాకు ముందు మరో ప్రాజెక్ట్ ను సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేయాలనుకుంటున్నాడట మహేశ్. అందుకే ఈ ఏడాది చివరలో అనిల్ రావిపూడితో సినిమా మొదలెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదలయ్యేలా ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడట. అప్పటికి రాజమౌళి కూడా స్క్రిప్ట్ తో రెడీగా ఉంటాడు కాబట్టి వెంటనే ఆ సినిమాలోకి ఎంటరవ్వాలన్నది మహేశ్ ప్లాన్ గా చెబుతున్నారు. సో మహేశ్ ఫ్యాన్స్ కి ఇది ఎంతో ఆనందాన్నిచ్చే న్యూస్.