హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ బాబు (Mahesh Babu) అలాగే త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో SSMB28 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని వారు చాలా ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుతున్నారు. త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు సినిమాపై సోషల్ మీడియాలో చాలానే రూమర్స్ జరుగుతున్నప్పటికీ మేకర్స్ వీటిపై ఎటువంటి కామెంట్ చేయలేదు. మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా మహేష్ బాబు SSMB28 సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ చేస్తున్నారు.
SSMB28 మేకర్స్ ఈ సినిమా టీజర్ ని (Teaser) సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా [మే 31] థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అదే రోజున కృష్ణ గారి పాత క్లాసిక్ సినిమా మోసగాళ్లకు మోసగాడు కూడా థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. కాబట్టి, మోసగాళ్లకు మోసగాడు ఆడే థియేటర్లలో SSMB28 Teaserను జోడించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు మేకర్స్ SSMB28 సినిమాని జనవరి 13, 2024 చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు ఈ నెల చివరికి హైదరాబాదుకి తిరిగి రాగానే జూన్ నుండి SSMB28 సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం అందుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Web Title: Mahesh Babu, Trivikram next SSMB28 teaser release date confirmed, Pooja Hedge, Sreeleela, SSMB28 shooting update, SSMB28 teaser on May 31,2023, SSMB28 latest schedule update