ఆ విషయంలో మహేష్ బాబు చిత్రయూనిట్ పై సీరియస్..!

0
2544
Mahesh Babu Upset for Sarkaru Vaari Paata shooting pics leaked

Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. తాజాగా “సర్కారు వారి పాట” విషయంలోనూ లీక్‏ల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు ఆన్ లొకేషన్ స్టిల్స్, స్టోరీ డైలాగ్స్ లీక్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కథ ప్రకారం మహేష్ బాబు ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి క్లాస్ పీకే సీన్ ఉందని తెలుస్తోంది. ‘పొద్దునే లేచి వాకింగ్ చేశామా..? మంచి డైట్‌ ఫుడ్‌ తిన్నామా..? మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్‌ చూశామా..? కొడుకు, మనవడు, మనవరాలితో ఆడుకుని.. మళ్లీ తిని పడుకున్నామా..? లేదా..?ఇదే కదా మనం చేసేది రోజూ..’ అంటూ మహేష్ చెప్పే ఈ డైలాగ్ లీక్ అయింది.

అయితే ఈ లీక్స్ విషయంలో మహేష్ బాబు అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మహేష్ బాబు.. పలుమార్లు చిత్రయూనిట్ సభ్యులకు తెలియజేసినా ఫలితం లేదని.. మళ్లీ మళ్లీ సినిమా విషయాలు లీక్ అవుతున్నాయని.. దీంతో.. ఈ విషయమై.. మరోసారి చిత్రయూనిట్ సభ్యులపై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

Sarkaru Vaari Paata Leaked shooting Photos and stills

దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్.. షూటింగ్ లొకేషన్‏లోకి ఎవరూ మొబైల్ తీసుకురాకుండా ఉండాలని డైరెక్టర్ పరశురామ్ సూచించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ మూవీ రాబోతుండగా.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Sarkaru Vaari Paata Leaked shooting Photos and stills

Sarkaru Vaari Paata Leaked shooting Photos and stills