Mahesh Babu Next #SSMB27 with Vamsi Paidipally Vizag backdrop story
Mahesh Babu Next #SSMB27 with Vamsi Paidipally Vizag backdrop story

(check out Mahesh Babu Next #SSMB27 with Vamsi Paidipally Vizag backdrop story. Mahesh upcoming movie news )సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికా ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ హాడావుడి.. ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మహేష్ అమెరికా వెళ్లారు. ఈ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మహేష్ తన తదుపరి చిత్రం పై దృష్టి సారిస్తారు.’సరిలేరు నీకెవరు’ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసందే. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తరవాత మహేష్ బాబు వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కథ గురించి.. మహేష్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. వైజాగ్ పోర్ట్ ఏరియాలో జరిగే గ్యాంగ్ వార్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడంట వంశీ. వైజాగ్ పోర్ట్ ను శాసించే పవర్ఫుల్ డాన్ గా మహేష్ కనిపిస్తారని సమాచారం. ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం మహేష్ కు కొట్టిన పిండే. ‘అతడు’ లో కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలోనూ.. ‘బిజినెస్ మేన్’ లో మాఫియాను కార్పోరేట్ బిజినెస్ గా మార్చే వ్యక్తిగానూ నటించారు. ఇక ‘పోకిరి’ లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ చివరివరకూ ఒక గ్యాంగ్ స్టర్ లాగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి అలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించడం ఆసక్తిని రేకెత్తించే అంశమే.ఈ సినిమాకూడా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు వంశీ.