Mahesh Babu welcomes Keerthy Suresh on the board for Sarkaru Vaari Paata

keerthi suresh: Sarkaru Vaari Paata: మహానటి’ సినిమాతో శిఖరస్థాయి ఇమేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రిని మరిపిస్తూ ఆమె చూపించిన అభినయం ప్రేక్షకుల మనసులను దోచుకుని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ అనే సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ‘సర్కారు వారి పాట’ మేకర్స్ నుంచి హీరోయిన్ గురించి ఆఫీసియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ ని తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన కో స్టార్‌కు సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీమ్ మీకు ఫారిన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌‌బాబు ట్వీట్‌ చేశారు.

కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికాలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.