Mahesh Babu gym workouts Photos: మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తూ అలాగే మరో పక్క జిమ్ వర్కౌట్స్ తో బిజీబిజీగా ఉంటున్నారు. గుంటూరు కారం షూటింగు ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది.
ఈ సినిమాని త్రివిక్రమ్ సంక్రాంతికి విడుదల చేసే పనిలో షూటింగ్ జరుపుతున్నారు. అయితే గుంటూరు కారం మొదటి సాంగ్ ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు సమాచారమైతే అందుతుంది. ఇక మరో పక్క Mahesh Babu జిమ్ వర్కౌట్ ఫొటోస్ ఫాన్స్ ని అలాగే మూవీ లవర్స్ ని అలరిస్తున్నారు.
అయితే ఈరోజు మహేష్ బాబు తన Social మీడియా ఎకౌంట్లో ఒక ఫోటోని పోస్ట్ చేయటం జరిగింది. . ఈ ఫోటో గమనిస్తే మహేష్ బాబు స్ప్రింగ్ లాగా తన బాడీని స్ట్రక్చర్ చేసి వర్కౌట్ చేయడం మనం చూడవచ్చు. ఈ ఫోటోని షేర్ చేస్తూ బాడీ స్ట్రైక్ చాలా అవసరం అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ జిమ్ వర్కౌట్ దేనికోసం అంటూ కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరుగుతుంది. ఒకపక్క గుంటూరు కారం షూటింగ్ జరుపుతూనే మరోపక్క తన రాబోయే రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా వస్తున్న సినిమా మహేష్ బాబు రాజమౌళి SSB29 అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం రాజమౌళి అలాగే తన టీం పని చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాని రాజమౌళి డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో మొదలుపెడతారు అంటూ తెలుస్తుంది.
అయితే ఈ సినిమా షూటింగు గుంటూరు కారం విడుదల అయిన తర్వాత ప్రారంభిస్తారు అంట. అంటే 2024 సమ్మర్లో SSMB29 షూటింగు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే గుంటూరు కారం సినిమాని Trivikram డిసెంబర్ లోపల కంప్లీట్ చేసి జనవరి విడుదల చేసే ప్లాన్ అయితే పక్కాగా చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో Sreeleela అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేస్తున్నారు అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు.