శరవేగంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్..!

0
1259
Mahesh Babu's Sarkaru Vaari Paata Movie shooting leaked again
Mahesh Babu's Sarkaru Vaari Paata Movie shooting leaked again

Mahesh Babu, Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ రివీలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలో హైలైట్‌గా నిలవబోయే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారట. అయితే తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి బయటకొచ్చిన కొన్ని ఫొటోస్ చూస్తుంటే ఇందులో మహేష్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఛేజింగ్ సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

Also Read: ఆ విషయంలో మహేష్ బాబు చిత్రయూనిట్ పై సీరియస్..!

బుల్లెట్ బండిపై అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో మహేష్ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేంటో తెలియాలి అంటే ‘సర్కారు వారి పాట’ విడుదల వరకు ఆగక తప్పదు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్, అర్జున్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు.

Mahesh Babu's Sarkaru Vaari Paata Movie shooting leaked again
Mahesh Babu’s Sarkaru Vaari Paata Movie shooting leaked again

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపుతూ జనవరి 13న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: మహేష్ బాబు సర్కారు వారి పాట టీమ్ రెడీ..! 

 

Previous article“అఖండ” బీజీఎం వర్క్ స్టార్ట్ చేసిన తమన్..!
Next articleStunning 3rd week TRP Rating For NTR EMK Show