మహేష్ బాబు ఎట్టకేలకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై మాట్లాడటం జరిగింది. తన తండ్రి కృష్ణ బయోపిక్‌లో నటించాలనే ఉద్దేశం తనకు లేదని, అయితే తాను తప్పకుండా నిర్మించాలనుకుంటున్నానని మహేష్ చెప్పడం జరిగింది. తన తండ్రి కృష్ణ తనకు దేవుడిలాంటివాడని మహేష్ బాబు అన్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మే 12న విడుదలకు సిద్ధం చేశారు. అలాగే దీనితో పాటు మహేష్ బాబు నిర్మిస్తున్న అడవి శేషు మేజర్ సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేయడం జరిగింది.
మేజర్ ట్రైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కృష్ణ బయోపిక్ గురించి అడిగారు. దానికి మహేష్ బదులిస్తూ, “ఇది (బయోపిక్) నిజంగా జరిగితే నేను నిజంగా సంతోషిస్తాను, కానీ నేను ఇందులో నటించనని చెప్పాలి. కృష్ణగారు నాకు దేవుడిలాంటివారు. బదులుగా నేను దానిని నిర్మించాలనుకుంటున్నాను” అని బదులిచ్చారు.
ప్రస్తుతం తన కొనసాగుతున్న ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టినట్లు మహేష్ తెలిపారు. “నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. గత 4-5 ఏళ్లలో నేను టచ్ చేసినవన్నీ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. నా అభిమానులకు మరియు సాధారణ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తానని ఈ ప్రెస్ మీట్ ద్వారా మహేష్ ప్రజలకు చెప్పడం జరిగింది.