Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News
Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News

మహర్షి సినిమాకి కౌంట్ డౌన్ కూడా పూర్తి కావొస్తుంది.ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండడంతో మహేష్ అభిమానులు కాలర్స్ ఎగరేస్తూ కట్ ఔట్స్ కడుతున్నారు.ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది అని సంబరపడుతున్న వాళ్ళకు ఈ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ గురించి వస్తున్న లీక్స్ మరింత జోష్ ఇస్తున్నాయి.

అసలు ఈ సినిమాలో మహేష్ క్యారెక్టరైజేషన్ ఊహాతీతంగా సాగుతుంది.కాలేజ్ ఎపిసోడ్ లో అదిరిపోయే కామెడీ తోపాటు సినిమాకి కీలకమయిన అనేక పాయింట్స్ చూపిస్తారు.అందుకే ముందుగా కాలేజ్ ఎపిసోడ్ ని షూట్ చేశారు.కథ పరంగా శ్రీమంతుడు ఫార్ములా కాకపోయినా హైలైట్స్ ప్లేస్మెంట్ లో మాత్రం అచ్చంగా దాన్నే ఫాలో అవుతున్నారు అని అంటున్నారు.అందుకే ఈ సినిమాలో విలన్ కి మహేష్ వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోతుంది అని టాక్.ఈ మధ్య లాండ్ పూలింగ్ లాంటి విషయాలు బాగా పాపులర్ అవ్వడంతో దానికి దానికి దగ్గరిగా ఉండేలా ఈ సీన్ ని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

అలానే భరత్ అనే నేను క్లయిమాక్స్ లో ఉన్న ప్రెస్ మీట్ లా దానికి మించిన ఎమోషనల్ కంటెంట్ తో,క్లాప్స్ పడే డైలాగ్స్ తో ఉండే ప్రెస్ మీట్ సీన్ సినిమాకి మెయిన్ హైలైట్ అంటున్నారు.గతంలో ఈ సీన్ పిక్స్ లీక్ అయ్యాయి.అలాగే ఈ సినిమా మొత్తానికి కదిలించే క్లయిమాక్స్ హార్ట్ గా నిలబోతుంది అని,అది వినే సినిమాకు కనెక్ట్ అయిపోయాడు అనేది యూనిట్ మాట.ఆడియో లో అంతగా అనిపించని ఆడియో కూడా సినిమాలో మాత్రం ఫ్లో తో పాటు,రిచ్ విజువల్స్ తో పాటు ఉండి అలరిస్తాయి అంటున్నారు.ఇక సినిమాటిగ్రఫీ ఈ సినిమాకి ఎసెట్ అని,దేవి ఆర్.ఆర్ తో ఫ్లాట్ చేసేస్తాడు అని చెబుతున్నారు.మొదటి ఆట పడగానే వీటిలో నిజమెంత అనేదానిపై క్లారిటీ వచ్చేస్తుంది.కానీ మహర్షి కి పనిచేస్తున్న డిజిటల్ టీమ్ అంతా ఈ విషయాలనే ఫోకస్ చేస్తున్నారు.ఇక మహేష్ కూడా ప్రొమోషన్స్ లో కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ సక్సెస్ చార్మ్ తో స్మైల్స్ ఇస్తున్నాడు.ఇదంతా చూస్తుంటే మహర్షి టీమ్ బ్లాక్ బస్టర్ పై కాకుండా ఇండస్ట్రీ హిట్ పై కన్నేసినట్టు అనిపిస్తుంది.