డైరెక్టర్‌ సుధ కొంగరతో మహేష్‌ సినిమా

0
300
mahesh-next-movie-with-sudha-kongara
mahesh-next-movie-with-sudha-kongara

సూపర్ స్టార్ మహేష్ తాజాగా చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ చేస్తోంది.  ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోందని టాక్‌. ఇక ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం చిత్ర బృందం ఇటీవలే దుబాయ్‌కు వెళ్లింది. ఇది ఇలా ఉంటే..

 

 

మహేష్‌బాబు ఈ మూవీ తర్వాత మరో సినిమాను చేయనున్నాడట. అది కూడా ఓ లేడీ డైరెక్టర్‌తో కావడం విశేషం. గురు, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధ కొంగర…. ప్రిన్స్‌ మహేష్‌ కోసం ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ కథపై చర్చలు కూడా జరుగనున్నాయని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్‌ దుబాయ్‌ వెళ్లగా…ఆయన హైదరాబాద్‌ తిరిగొచ్చిన తర్వాత సుధ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.