సరిలేరు 50రోజుల విజయోత్సవం..ప్రత్యేక అతిథిగా ఆయనేనా…??

mahesh sarileru neekevvaru 50 days celebrations planning at vijayawada
mahesh sarileru neekevvaru 50 days celebrations planning at vijayawada

(makers of mahesh sarileru neekevvaru 50 days celebrations planning at vijayawada, Mahesh babu 2020 upcoming movie latest news)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలుత యావరేజ్ టాక్ ని సంపాదించినప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ చాలా రోజుల తరువాత మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ లో నటించడంతో పాటు వరుసగా సంక్రాంతి సెలవలు రావడం కూడా సరిలేరు సినిమాకు బాగా కలెక్షన్ రావడానికి దోహద పడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా..

ఇకపోతే ఇటీవల బాగా కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని ఈ సినిమా అందుకోవడంతో సూపర్ స్టార్ సహా ఆ సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆనందంతో సక్సెస్ మీట్ ని వరంగల్ జిల్లా హన్మకొండ లో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక దాని అనంతరం మహేష్ బాబు, తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు.

“భరత్ అనే నేను”, “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సరిలేరు నీకెవ్వరు”మూవీ 50 డేస్ వేడుక ను అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ సమక్షం లో గ్రాండ్ గా జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఈ మూవీ వేడుక డేట్, ప్లేస్ త్వరలో వెల్లడికానున్నాయని సమాచారం. ఒక టాలీవుడ్ స్టార్ హీరో ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న ఈ వేడుక విజయవాడలో జరిగే అవకాశం ఉందట.