సర్కారు వారి పాట సెట్స్‌లో అడుగుపెడుతున్నమహేష్‌..!

472
Mahesh Sarkaru Vaari Paata shooting start from January 25

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లాస్ట్ మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ గా నిలిచినా సంగతి తెలిసిందే. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ బ్యాక్‌డ్రాప్‌ను అమెరికా నుంచి దుబాయికి మార్చేస్తున్నారట. చిత్ర దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. మహేష్ నుంచి ఒక సాలిడ్ మేకోవర్ తో రానున్న ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu keerthy suresh Next Movie shooting Update

ఫైనల్ గా ఇప్పుడు దుబాయ్ షెడ్యూల్ కు గాను రంగం సిద్ధం అవుతుండగా సూపర్ స్టార్ మహేష్ అందుకు గాను సంసిద్ధం అవుతున్నారు.ఈ నెల 25 నుంచి చిత్రీకరణ దుబాయిలో స్టార్ట్‌ చేస్తారట. అక్కడ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్‌ వచ్చిన ప్రధాన టాకీ పార్టును పూర్తి చేస్తారట. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే బడాబాబుల నేపథ్యంలో సినిమా ఉండబోతోందని టాక్‌. తాజాగా షూట్ నిమిత్తం మహేష్ ప్రయాణం కూడా అయ్యారు.

ఇక ఈ చిత్రంలో మహేష్ తో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సహా మహేష్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ మాస్ ఫ్లిక్ ను నిర్మించనున్నారు. మరోవైపు దర్శకుడు పరశురామ్‌ అయితే రెండున్నరేళ్ల గ్యాప్‌ తర్వాత మెగాఫోన్‌ పట్టుకోబోతున్నాడు.