ఈ బ్యూటీకి ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో ?

132
Divyansha Kaushik , Tollywood Actress, Latest Movie News
Divyansha Kaushik , Tollywood Actress, Latest Movie News

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా.. ఒక్కోసారి ఛాన్స్ లు మాత్రం రావు. ఇందుకు నిదర్శనం భారీ హిట్ అందుకున్నాక కూడా అవకాశం లేక ఖాళీగా కూర్చొన్న బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ కౌశికే. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఈ అమ్మడు బాగా ఆకట్టుకుంది. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. దాంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాకపోవడంతో ఆమెకు పెద్దగా ఆఫర్స్ కూడా రావట్లేదు. మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమాలు చేసుకుంటూ ఉంటే.. దివ్యాంశ కౌశిక్ మాత్రం ఛాన్స్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికే మజిలీ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి.. ఈ భామ మాత్రం సినిమా ఆఫర్ కోసం ఇంకా ఎదురుచూస్తూ ఉంది. నిజానికి మజిలీలో దివ్యాంశ కౌశిక్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. అయినా ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో పాపం.

మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి.. సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది. ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. అయితే మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”లో దివ్యాంశ కౌశిక్ కి అవకాశం వచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమాలో ర‌వితేజ సరసన హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ తీసుకున్నారు. అలాగే ఓ తమిళ్ సినిమాలోనూ దివ్యాంశ కౌశిక్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. కనీసం నాగ చైతన్య అన్నా .. లేక దర్శకుడు శివ నిర్వాణనైనా తమ తరువాత సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు కూడా మొహం చాటేస్తున్నారట. పాపం బాలీవుడ్ బ్యూటీ.