మేజ‌ర్ ఎలా పుట్టిందో వివ‌రించిన అడివి శేష్‌

0
214
Major Beginnings Adivi Sesh Explains How Sandeep Unnikrishnan Influenced And Inspired Him

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెస్మరేజ్ చేసేశాడు యంగ్ హీరో అడివి శేష్. ఆ సినిమాలతో అతడి క్రేజ్ ఎంతగానో పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు ఓ ప్రయోజనాత్మకమైన బయోపిక్ లో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో రూపొందుతున్న ‘మేజర్’ మూవీని సోనీ పిక్చర్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జియమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్, ఎ ప్లస్ యస్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల – బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎలా స్టార్ట్ అయింది? అందులోని లుక్ టెస్ట్ తనకి లిట్మస్ టెస్ట్ గా ఎలా మారింది అనే విషయాలు ఒక వీడియోలో వెల్లడించాడు అడివి శేష్.

వీడియోలో అడివి శేష్ మాట్లాడుతూ.. 2008 నుంచి తనకు సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తెలుసని, ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు తాను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నానని, ఆ సమయంలో అక్కడి న్యూస్ చానల్స్ లో ఆయన ఫోటో వేశారని.. సడెన్ గా ఆయన్ను చూసిన తనకి తన అన్నయ్య గుర్తుకు వచ్చాడని, ఆయన కళ్ళల్లో ఒక స్పిరిట్ ఉందని చెప్పాడు. అప్పటినుంచి ఆయన గురించి వచ్చిన ప్రతీ న్యూస్ ఐటెమ్ ను కట్ చేసి భద్ర పరిచేవాడనని.. అది గడిచిన పదేళ్ళకే తాను ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు శేష్. మేజర్ లాంటి పాన్ ఇండియా మూవీని చేయగలననే నమ్మకం తనకు కలిగిన తర్వాతే ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ను కలిశానని.. వారితో మాట్లాడిన నాలుగైదు రోజుల తర్వాత తన కొడుకుతో సినిమా చేయగలవని తాము పది శాతం నమ్ముతున్నామని చెప్పారని అన్నాడు. అంతేకాదు మేజర్ సందీప్ ఐకానిక్ ఫోటో కోసం నవ్వు ఆపుకుంటూ పాస్ పోర్ట్ దిగాడట శేష్.

ఆ ఫోటోని చూసి మేజర్ పేరెంట్స్ లో కాన్ఫిడెన్స్ వచ్చిందని .. ఆ తర్వాత ఈ కథ గురించి మహేశ్ బాబు , సోనీ పిక్చర్స్ వారి సహాయ సహకారాలతోనే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగలుగుతున్నామని రివీల్ చేశాడు అడివి శేష్. అలాగే.. ఈ సినిమా కోసం తాను సందీప్ ను మ్యాచ్ చేస్తూ దిగిన పాస్ ఫోటో సైజ్ ఫోటో ను కూడా లుక్ టెస్ట్ గా రివీల్ చేసి ఆకట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here